Mon Feb 09 2026 22:29:10 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : తెలంగాణ ఎన్నికలు 2029 లోనే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ లు కాకపోవడానికి కారణం ప్రభాకర్ రావును ఇరవై నెలలు అమెరికాలో దాచి పెట్టడమేనని అన్నారు. అరెస్ట్ లపై బావాబామ్మర్దులిద్దరూ పోటీ పడుతున్నట్లుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొని ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ ను ఆలోచించుకుని ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పన్నెండేళ్ల నుంచి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా బీజేపీ మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు.
ఈసారి జమిలీ ఎన్నికలు...
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పిన మోదీ, తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారని, కానీ మనం జీఎస్టీ రూపంలో రూపాయి కేంద్రానికి ఇస్తే నలభై రెండు పైసలు మాత్రమే రాష్ట్రానికి ఇస్తుందని చెప్పారు. తర్వాత చిట్ చాట్ లో ఈసారి దేశంలో జమిలీ ఎన్నికలు రానున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా జనగణన జరుగుతాయని, 2029లోనే తెలంగాణకు శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు జనగణన చేసి అన్యాయం చేయాలని చూస్తుందని తెలిపారు.
Next Story

