Fri Dec 05 2025 08:07:31 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రేవంత్ రెడ్డి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయన మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రులను డివిజన్ల వారీగా ఇన్ ఛార్జులుగా నియమించనున్నారు. ప్రచార వ్యూహంతో పాటు పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించనున్నారు.
ఇన్ ఛార్జులుగా మంత్రులు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది. ఇప్పటికే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా కొందరు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మంత్రులను కూడా ఇన్ ఛార్జులుగా నియమించి పార్టీ అభ్యర్థి విజయావకాశాలను మెరుగుపర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
Next Story

