Revanth Reddy : లబ్దిదారులకు ఇక ఫేషియల్ రికగ్నేషన్.. రేవంత్ కీలక నిర్ణయం
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలని కలెక్టర్లకు సూచించారు. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి.. వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, వ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని, ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలన్నారు.

