Tue Mar 17 2026 17:32:13 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు మూడు సభల్లో రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నేడు మూడు సభల్లో పాల్గొననున్నారు

తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసింది. మూడు జాబితాలను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోనూ బీఆర్ఎస్కు ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆరు గ్యారంటీలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో...
ఆయన ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో జరిగే మూడు సభల్లో పాల్గొంటున్నారు. అలంపూర్, గద్వాల్, మక్తల్ లో జరిగే బహిరంగ సభల్లో నేడు రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలంపూర్ కు చేరుకుని రేవంత్ రెడ్డి అక్కడ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం గద్వాల్, మక్తల్ కు వెళ్లి అక్కడ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

