Sat Mar 07 2026 23:56:12 GMT+0530 (India Standard Time)
రేపు మునుగోడుకు రేవంత్
రేవంత్ రెడ్డి రేపు మునుగోడుకు వెళుతున్నారు. ఆయన కరోనా నుంచి కోలుకోవడంతో రేపటి నుంచి జరిగే పాదయాత్రలో పాల్గొననున్నారు

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు మునుగోడుకు వెళుతున్నారు. ఆయన కరోనా నుంచి కోలుకోవడంతో రేపటి నుంచి జరిగే పాదయాత్రలో పాల్గొననున్నారు. రేపు జరిగే రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మునుగోడులోని అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నారు. రేవంత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
పాదయాత్రలో...
ఈ నెల 15వ తేదీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి కరోనా సోకడంతో ఆయన పాదయాత్రకు దూరంగా ఉన్నారు. రేపటి నుంచి మునుగోడులో రేవంత్ పర్యటన ఉండనుంది. మండలాల వారీగా నేతలతో ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.
Next Story

