Mon Dec 08 2025 12:05:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి
మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై అనేక కేసులున్నాయని, వాటిని కప్పి పుచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇప్పటికే తాము కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నందుకే హడావిడిగా ఐఏఎస్ కు రాజీనామా చేయించి వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.
ఆరోపణలున్నా....
వెంకట్రామిరెడ్డి రాజీనామాను చీఫ్ సెక్రటరీ ఎలాంటి అభియోగాలున్నాయన్నది ఆలోచించకుండా ఆమోదించారన్నారు. దీనిపై డీఓపీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆయనపై అనేక కేసులున్నాయని, వెంకట్రామిరెడ్డి పెద్ద అవినీతి పరుడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయనపై రాష్ట్రపతి దగ్గర నుంచి అన్ని రాజ్యాంగ వ్యవస్థలకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story

