Tue Jan 13 2026 06:16:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకు ఇక పండగే
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త విధానంలో మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలను కల్పించాలని నిర్ణయించింది. మోడల్ స్కూల్ లో చేరితే నాణ్యమైన విద్య లభిస్తుందని భావించడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రవేశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి అడ్మిషన్లలో మార్పులపై కొన్ని ప్రతిపాదనలను రూపొందించి వాటిని ప్రభుత్వానికి పంపారు. నేడో, రేపో చర్చించి ఆ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశముంది.
ప్రవేశ ప్రక్రియలో కొత్త విధానం...
తెలంగాణలో మొత్తం మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకు రావాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్ లో ఆరో తరగతి ప్రవేశానికి అర్హత సాధిస్తే ఇంటర్మీడియట్ వరకూ చదివే వీలుంటుంది. నవోదయ పాఠశాలల తరహాలో విద్యాబోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ విద్యాబోధన జరుగుతుంటుంది. ఇకపై ఐదో తరగతి నుంచి మోడల్ స్కూళ్లలో ప్రవేశాలను కల్పించాలని నిర్ణయించింది.
ఐదో తరగతి నుంచి...
ప్రభుత్వానికి ఐదో తరగతి నుంచి విద్యాబోధన చేస్తే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడమే కాకుండా ఆరో తరగతి నుంచి బలమైన స్టాండర్ట్స్ లభిస్తాయని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆరోతరగతి నుంచి కాకుండా ఐదో తరగతి నుంచి మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలను కల్పించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఓకే అంటే 2026 విద్యాసంవత్సరం నుంచి ఐదో తరగతి నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతుంది. ఒకరకంగా ఇది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఐదు, ఆరో తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించి అనంతరం అడ్మిషన్లను పూర్తిచేయనున్నారు.
Next Story

