Sat Dec 06 2025 00:52:04 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లలోనే నిధులు జమ
తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. రైతుల తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.
రైతు భరోసా పథకం కింద...
జనవరి 26న ఈ రైతు భరోసా పథకం కింద ప్రభుత్వ నిధులను జమ చేయడాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫిబ్రవరి 5వ తేదీన 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇప్పటివరకు రెండు ఎకరాల లోపు ఉన్న 34 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2200 కోట్లు జమ చేసింది. ఇప్పటి వరకూ 37 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం నగదును జమ చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది.
Next Story

