Mon Mar 23 2026 14:03:55 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : హిల్ట్ పాలసీని అందుకే తీసుకు వచ్చాం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో పలు అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో పలు అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. హిల్ట్ పాలసీ తీసుకువచ్చింది నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకేనని చెప్పారు. శాసనమండలిలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలను తరలించి వారికి అనువైన స్థలాన్నివేరేచోట కేటాయిస్తామని తెలిపారు. నగరానికి దూరంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తే కాలుష్యం నుంచినగర వాసులు బయటపడతారని అన్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో...
అలాగే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలతో కాలుష్యం పెరిగిపోయిందని, ఢిల్లీతరహా కాలుష్యం హైదరాబాద్ ను చుట్టుముట్టక మునుపే మనం నగరాన్ని రక్షించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ ప్రక్షాళనతోనూ కాలుష్యాన్ని నివారించవచ్చని, పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని కోరారు.
Next Story

