Sat Mar 28 2026 19:54:13 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : మైనింగ్ అక్రమాలకు సీఐడీ విచారణకు సిద్ధం
మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు

గత ప్రభుత్వం పాలనలో మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. నాడు హరీశ్ రావు, కేటీఆర్ మైనింగ్ మంత్రులుగా ఉన్నప్పుడు అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. హరీశ్ రావు సోదరుడు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్నారు. ఇసుకను దోచుకున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో...
అలాగే సంతోష్ కుమార్ తో పాటు ఆయన తండ్రి నేరెళ్లలో ఇసుక దందాపై కూడా విచారణ జరిపిద్దామని అన్నారు. హరీశ్ రావు సోదరుడు గత ప్రభుత్వ హయాంలో ఇసుకను అక్రమంగా దోచుకున్నట్లు అనేక ఆరోపణలున్నాయని, వాటితో పాటు రాఘవ కనస్ట్రక్షన్స్ పైన కూడా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు.
Next Story

