Wed Feb 11 2026 14:48:17 GMT+0530 (India Standard Time)
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతంటే?
కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు

కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జెడ్పీ స్కూల్లో ఓటు వేసిన సీఎం రేవంత్రెడ్డి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మధిర పట్టణంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన ఓటును వేశారు. మల్లుభట్టి విక్రమార్క క్యూ లైన్ లో ఉన్నవారందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు.
అనేక చోట్ల ఘర్షణలు...
మరొకవైపు ఈరోజు ఉదయం 9 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పదమూడు శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు తెలిపారు. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ లో దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. బోధన్ లో బీఆర్ఎ, ఎంఐఎం కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నర్పాపూర్ మున్సిపాలిటీ పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.
Next Story

