Mon Jan 12 2026 15:10:30 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ప్రభుత్వోద్యోగులకు రేవంత్ సర్కార్ స్పెషల్ గిఫ్ట్
సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

సంక్రాంతి సందర్భంగా ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా డీఏ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకూ, ప్రజలకూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
గత ప్రభుత్వంపై విమర్శలు...
అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారన్న అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయని, అది తప్పని, మనమంతా ఒకే కుటుంబమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబంలో కుట్రలు ఉండవని, మీరు, నేను వేరు కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.దేవతలు యజ్ఞం చేస్తున్నప్పటికీ రాక్షసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని, ఒక శుక్రాచార్యుడు ఫామ్‌హౌస్‌లో ఉంటూ మారీచుడులాంటి వారిని అసెంబ్లీకి పంపిస్తున్నాడని వ్యాఖ్యానించారు.గత .8 లక్షల కోట్ల అప్పుల భారం కాంగ్రెస్ ప్రభుత్వంపై మోపిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదాయం నెలకు రూ.18 వేల కోట్లుగా ఉంటే, అప్పుల కింద నెలకు రూ.22 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.
Next Story

