Thu Apr 09 2026 17:50:51 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : నేడు కొడంగల్ లో ఓటేయనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ బయలుదేరి వెళతారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ బయలుదేరి వెళతారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన వెళ్లనున్నార. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి కొడంగల్ కు వెళతారు. అక్కడ ఉదయం 11.30 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారు.
తర్వాత ఢిల్లీకి...
అనంతరం అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఢిల్లీలో ఆయన పార్టీ నేతలను కలిసే అవకాశముంది. ఏఐసీసీ నేతలను కలసి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను, మంత్రివర్గ విస్తరణ, మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశముంది. దీంతో పాటు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. కృష్ణా - గోదావరి నీటి మళ్లింపు ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని తెలిసింది.
Next Story

