Sun Dec 14 2025 01:50:47 GMT+0000 (Coordinated Universal Time)
Telagnana : యాదగిరి గుట్ట ఆలయానికి మూడంతస్తుల భవనం విరాళం
తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్ట ఆలయానికి రిటైర్డ్ ఉద్యోగి నాలుగు కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చారు

తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్ట ఆలయానికి రిటైర్డ్ ఉద్యోగి నాలుగు కోట్ల విలువైన ఇంటిని విరాళంగా ఇచ్చారు. ముత్తినేని వెంకటేశ్వర్లు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు హైదరాబాద్ లోని తిలక్ నగర్ లో 152 గజాల్లో మూడంతస్థుల ఇల్లు ఉంది. దీని బయట మార్కెట్ విలువ నాలుగు కోట్ల రూపాయలు ఉంటుంది.
మూడంతస్థుల భవనాన్ని...
అయితే తన మూడంతస్థుల ఇంటిని యాదగిరి గుట్ట ఆలాయానికి ముత్తినేని వెంకటేశ్వర్లు విరాళంగా అందచేశారు. ఈ మేరకు ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో తన మూడంతస్థుల భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పత్రాలను శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి పేరు మీద చేసి అంద చేశారు. ఆలయ అధికారులు వెంకటేశ్వర్లును సత్కరించారు.
Next Story

