Wed Dec 17 2025 14:07:20 GMT+0000 (Coordinated Universal Time)
కొండా సురేఖ బాటలో మరికొందరు?
సీనియర్ నేత కొండా సురేఖ రాజీనామా పార్టీలో కలకలం రేపుతుంది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టుకు ఆమె రాజీనామా చేశారు

పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ రాజీనామా పార్టీలో కలకలం రేపుతుంది. టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టుకు ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తనకంటే జూనియర్లకు రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించారని, వరంగల్ జిల్లా నేతలకు ఎవరినీ నియమించకపోవడం పట్ల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది తమను అవమానించడమేనని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
సామాన్య కార్యకర్తగానే....
తాను పార్టీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగేందుకు ఇష్టపడతానని కొండా సురేఖ తెలిపారు. తనకు పదవులు కాదని, ఆత్మాభిమానం ముఖ్యమని ఆమె తెలిపారు. కొండా సురేఖ బాటలో మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. వారు తమ అసంతృప్తిని పార్టీ హైకమాండ్ కు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్ నేతలు అసంతృప్తితో పాటు అసహనంతో ఉన్నారు.
Next Story

