Fri Dec 05 2025 20:01:57 GMT+0000 (Coordinated Universal Time)
SLBC : తొమ్మిది రోజుల నుంచి జాడ తెలియలేదే.. గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుందా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందులో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం గాలింపు చర్యలు తీవ్రమయ్యాయి. టన్నెట గ్గర జీపీఆర్ మార్కింగ్ చేసిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. బురదలో కూరుకుపోవడమే కాకుండా ఆక్సిజన్ అందక మరణించి ఉండవచ్చని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం అంబులెన్స్ లతో పాటు పోస్టుమార్టం నిర్వహించడానికి వైద్యులను సిద్ధంచేశారు. అదే సమయంలో ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించారు. మృతదేహాలను గుర్తుపట్టడానికి వీలుగా బంధువులు కూడా అక్కడే ఉణఉ్నారు.
మృతదేహాలను గుర్తించామంటూ...
మరికొన్ని గంటల్లో నాలుగు మృతదేహాలు వెలికితీసే అవకాశముందని రెస్క్యూ టీమ్ చెబుతున్నాయి. మృతులను సొంత గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్ లు కూడా సిద్ధం చేశారు. జీపీఆర్ ద్వారా రెండు మీటర్ల లోతులో నాలుగు మృతదేహాలు గుర్తించినట్లు వాటిని తీసేందుకు అవకాశం ఉన్నట్లు సహాయక బృదాలు చెబుతున్నాయి. మరో చోట ఏడు మీటర్ల లోతులో మరో నాలుగు మృతదేహాలు గుర్తించినట్లు చెబుతున్నప్పటికీ ఆ నాలుగు మృతదేహాలు తీయడం అసాధ్యం అని ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు చెబుతున్నారు. చాలా లోతులో ఉన్నందున వాటిని వెలికి తీయడం కష్టంగా మారుతుందని వారు చెబుతున్నారు. అయినా ఏదో రకంగా అన్ని మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ టీం సిద్ధమవుతుంది.
తొమ్మిది రోజులు గడిచినా...
ఇప్పటికి ప్రమాదం జరిగి దాదాపు తొమ్మిది రోజులు గడుస్తుంది. గత శనివారం ఈ ప్రమాదం జరగ్గా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ర్యాట్ హోల్ మేకర్స్, నేవీ, సింగరేణి కార్మికులు వారిని బయటకు తీసుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశాయి. ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నా వెలికి తీయడం సాధ్యం కాకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దాదాపు పదకొండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కన్వేయర్ బెల్ట్ సిద్ధమయితే తమ పని సులువుగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మంత్రులు, అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. అదే సమయంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్.ఎల్.బి.సి టన్నెల్ వద్దకు వెళ్లి అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story

