Telangana : ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు బీజేపీ చీఫ్ సంఘీభావం
తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ని కలిశారు.

తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ని కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులు, సవాళ్లు గురించి వివరించారు. ఈ రంగంపై 1,50,000కి పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. కేబుల్ ఆపరేటర్స్ సమస్యలను పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. రేపు ఇందిరా పార్క్ లో తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ ఆధ్వర్యంలో జరగనున్న ధర్నాకు బిజెపి మద్దతు ప్రకటించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వెల్లడించిన రాంచందర్ రావు, కేబుల్ ఆపరేటర్స్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో చాలా నష్టాల్లో ఉన్నారని, హైదరాబాద్లోని రామంతాపూర్ శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు జరిగిన దుర్ఘటన తర్వాత కేబుల్ ఆపరేటర్స్ను ఇబ్బందిపెట్టేలా, ఉపాధి కోల్పోయేలా పరిస్థితి సృష్టించారని తెలిపారు.

