Sat Mar 07 2026 18:16:15 GMT+0530 (India Standard Time)
Telangana : రిలయన్స్ కంపెనీ తెలంగాణ సర్కార్కు భారీ విరాళం
రిలయన్స్ ఫౌండేషన్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చింది. ఇరవై కోట్ల రూపాయల విరాళాన్ని అందచేసింది

రిలయన్స్ ఫౌండేషన్ తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చింది. ఇరవై కోట్ల రూపాయల విరాళాన్ని అందచేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్రంగా పంటనష్టంతో పాటు ఇళ్లు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలను తమకు తోచినంత రీతిలో అందచేస్తున్నారు.
ఇరవై కోట్ల రూపాయలు...
కాగా నేడు రిలయన్స్ ఫౌండేషన్ ఇరవై కోట్ల రూపాయలను అందచేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి ఇరవై కోట్ల రూపాయల చెక్కును అందచేసింది. నీతూ అంబానీ తరుపున ఆ ఫౌండేషన్ తరుపున ప్రతినిధులు ఈ చెక్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
Next Story

