Fri Dec 05 2025 09:29:25 GMT+0000 (Coordinated Universal Time)
హీరో మహేశ్ బాబుకు నోటీసులు
సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినయోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.

సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినయోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహేశ్ బాబు ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త మహేశ్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చింది.
రియల్ ఎస్టేట్...
మహేశ్ బాబు ఫొటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించి మోసపోయినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో మహేష్ బాబు కు వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఇదే రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఈడీ అధికారులు కూడా మహేష్ బాబుకు విచారణ కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story

