Mon Mar 16 2026 03:13:21 GMT+0530 (India Standard Time)
రేపు చిలుకూరు ఆలయంలోకి భక్తులకు నో ఎంట్రీ
చిలుకూరు బాలాజీ ఆలయంలోకి ఆదివారం భక్తులకు అనుమతి లేదని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు

చిలుకూరు బాలాజీ ఆలయంలోకి ఆదివారం భక్తులకు అనుమతి లేదని ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఆదివారం ఆలయంలో యథావిధిగా కళ్యాణ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. నిన్న గరుడ ప్రసాదం పంపిణీకి భక్తులు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రేపు ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదన్నారు.
కల్యాణోత్సవానికి...
భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామని రంగరాజన్ తెలిపారు. నిన్న సంతానం కోసం గరుడ ప్రసాదం కోసం వచ్చిన వారితో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్థంభించింది. దాదాపు అరవై వేల మంది భక్తులు సొంత వాహనాలతో తరలి రావడంతో పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. దీంతో రేపటి కల్యాణోత్సవానికి భక్తులను అనుమతించడం లేదని చెప్పారు.
Next Story

