Fri Feb 14 2025 01:36:13 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు
హైదరాబాద్ లో నేడు రామానుజా చార్య సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయి

హైదరాబాద్ లో నేడు రామానుజా చార్య సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 5వ తేదన ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
తొలిరోజు....
రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు అంతా సిద్ధమయింది. ఈరోజు తొలి రోజు కావడంతో ఉదయం 9 గంటలకు శోభాయాత్రను నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు వాస్తు శాంతి, రుత్విక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద యెత్తు వీవీఐపీలు, రాజకీయ నేతలు, ప్రజలు వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏడు వేల మంది పోలీసులను నియమించారు.
Next Story