Thu Mar 05 2026 19:18:08 GMT+0530 (India Standard Time)
Telangana : ఇద్దరూ ఏకగ్రీవం దిశగానే
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ ముగిసింది

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ ముగిసింది. తెలంగాణ నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ మూడుసెట్ల నామినేషన్ వేశారు. మరో కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా వేశారు.
ఇండిపెండెంట్ అభ్యర్థి...
దీంతో నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి స్క్రూటినీలో రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.అయితే అధికారిక ప్రకటన స్క్రూటినీ తర్వాత మాత్రమే ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది.
Next Story

