Fri Dec 05 2025 20:43:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై
బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు

బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ అగ్రనేతలతో మంతనాలు జరిపిన ప్రకాశ్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేసుకుంటారని చెబుతున్నారు. ప్రకాశ్ గౌడ్ రాకకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ లో చేరిక....
బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన నాటి నుంచి వరసబెట్టి ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని విడిచి వెళుతున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తో పాటు ముఖ్యనేతలు ఇప్పటికే కాంగ్రెస్ కండువాను కప్పేసుకున్నారు. అయితే తాజాగా ప్రకాష్ గౌడ్ కూడా అధికారికంగా చేరడం ఖాయమయిపోయినట్లేనని అంటున్నారు. ఇది నగరంలో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ.
Next Story

