Wed Jan 21 2026 02:26:52 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో రాహుల్ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈరోజు హైదరాబాద్ లో కొనసాగనుంది

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈరోజు హైదరాబాద్ లో కొనసాగనుంది. ఉదయం శంషాబాద్ నుంచి ప్రారంభమయిన యాత్ర సాయంత్రం చార్మినార్ వద్దకు చేరుకోనుంది. నెక్లెస్ రోడ్డులో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. రాత్రికి రాహుల్ గాంధీ బోయిన్పల్లిలో బస చేయనున్నారు. దీంతో హైదరాబాద్ లో ఈరోజు అనేక చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లను పోలీసులు ఏర్పాటు చేశారు.
నేడు యాత్రలో ఖర్గే...
పోలీసులు ముందుగానే ఈ ప్రాంతాల్లోకి రావద్దని వాహనదారులకు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఈ రహదారులపై ప్రయాణం చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. కాగా ఈరోజు రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి ఖర్గే రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
Next Story

