Sat Jan 31 2026 13:59:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ కు రాహుల్
రేపటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రానికి రాహుల్ హైదరాబాద్ చేరుకుంటారు.

రేపటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రానికి రాహుల్ హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మక్తల్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 6గంటలకు పాదయాత్రను రాహుల్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తొలుత మక్తల్ లోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
రేపటి నుంచి యాత్ర...
అనంతరం బయలుదేరి పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ రోడ్డు మీదుగా బండ్లగుంట వరకూ పాదయాత్రను కొనసాగిస్తారు. బండ్లగుంట వద్ద రాహుల్ గాంధీ లంచ్ చేస్తారు. సాయంత్రా నాలుగు గంటలకు తిరిగి ప్రారంభమయ్యే పాదయాత్ర గుడిగండ్ల గ్రామం వరకూ సాగనుంది. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు రాహుల్ గాంధీ పాదయాత్ర 26 కిలోమీటర్ల మేర సాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
Next Story

