Sun Mar 08 2026 03:31:16 GMT+0530 (India Standard Time)
రాహుల్ యాత్ర నేడు ఇలా
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 54వ రోజుకు చేరుకుంది. ఈరోజు షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 54వ రోజుకు చేరుకుంది. ఈరోజు షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. యాత్రకు బయలుదేరే ముందు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. గుజరాత్ లో కేబుల్ వంతెన విషాదంలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. ఈరోజు రాహుల్ గాంధీ 28 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
నేడు 28 కి.మీలు...
ఈరోజు రాహుల్ పాదయాత్ర లింగారెడ్డి గూడ, చంద్రాయణ గూడ, కొత్తూరు మీదుగా పెద్దషాపూర్ నుంచి ముచ్చింతల వరకూ జరుగుతుంది. కొత్తూరులో మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. అనంతరం నాలుగు గంటలకు బయలుదేరి సాయంత్రం పెద షాపూర్ చేరుకుని అక్కడ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రికి శంషాబాద్ సమీపంలోని తండుపల్లి వద్ద రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

