Tue Mar 17 2026 19:36:48 GMT+0530 (India Standard Time)
Rahul Gandhi : నేడు రాహుల్ తెలంగాణలో పర్యటన
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కూడా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కూడా రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు పలు సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కల్వకుర్తిలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం రాహుల్ సాయంత్రం 4:30 గంటలకు జడ్చర్లలో జరగనున్న కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. సమావేశాలకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సభల్లో పాల్గొని...
అనంతరం సాయంత్రం 6:15 గంటలకు షాద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి పాదయాత్ర చేస్తారు. అనంతరం చౌరస్తాలో జరిగే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. నిన్న కొల్లాపూర్ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈరోజు మలి విడతగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. 3వ తేదీ నుంచి అందరూ నామినేషన్లు వేయాల్సి ఉన్నందున రేపటి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story

