Sun Mar 08 2026 03:31:16 GMT+0530 (India Standard Time)
తెలంగాణలో నాలుగో రోజు యాత్ర
తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది

తెలంగాణలో నాలుగో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభమయింది. మహబూబ్ నగర్ జిల్లా జేఎంసీ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు నడక సాగిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర యాభై రోజులు దాటింది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు మీదుగా తెలంగాణకు చేరుకుంది.
విద్యార్థులను కలిసి...
ఐదు రాష్ట్రాల్లోనూ రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. ఏనుకొండలో 10.30 గంటలకు విరామం ప్రకటించనున్నారు. అనంతరం లంచ్ చేసి సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభించనున్నారు. రాత్రికి జడ్చర్ల జంక్షన్లో రాహుల్ బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు సినీ నటి పూనమ్ కౌర్ రాహుల్ తో కలిసి నడుస్తున్నారు. నేడు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ సమావేశం కానున్నారు.
Next Story

