Sun Mar 08 2026 03:33:31 GMT+0530 (India Standard Time)
నేడు 22 కి.మీ పాదయాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరోరోజు కొనసాగుతుంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి నుంచి ఆయన యాత్ర ప్రారంభమయింది

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరోరోజు కొనసాగుతుంది. జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమయింది. యాత్రలో అత్యధికంగా యువకులు పాల్గొన్నారు. ఈరోజు మేధావులు, విశ్లేషకులతో రాహుల్ సమావేశం కానున్నారు.
మేధావులతో సమావేశం...
ఈరోజు మొత్తం 22 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ. షాద్నగర్ మండలం సోలిపూర్ జంక్షన్ వరకూ రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ రాత్రి బస చేయనున్నారు. రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఈ యాత్రలో పాల్గొంటున్నారు
Next Story

