Wed Dec 17 2025 14:12:04 GMT+0000 (Coordinated Universal Time)
Congress : అన్నా చెల్లెళ్లు మరోసారి తెలంగాణకు
ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో మరోసారి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతుంది. ఈ నెల 28వ తేదీ వరకే ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల అగ్రనేతలు ఇక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలతోనూ, మ్యానిఫేస్టోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ప్రచారంలోనూ దూసుకెళుతూ ప్రజలను తమ వైపునకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంది.
కామారెడ్డికి రాహుల్...
ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో మరోసారి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. రాహుల్ గాంధీ ఈ నెల 26న కామారెడ్డి సభలో పాల్గొంటున్నారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తలపడుతుండటంతో రాహుల్ కామారెడ్డిలో ప్రచారానికి రానున్నారు. ప్రియాంకగాంధీ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. 24, 25, 27 తేదీల్లలో ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 24న పాలకుర్తి, ధర్మపురి, హుస్నాబాద్ లోనూ, 25న పాలేరు ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో ప్రియాక ప్రచారం చేస్తారు. 27న దేవరకొండ, మధిరలలో ఆమె పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

