Tue Mar 24 2026 17:54:26 GMT+0530 (India Standard Time)
కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ భేటీ అయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన తర్వాత భగవత్ సింగ్ తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఇది మర్యాదపూర్వకంగానే కలిసిన భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
జాతీయ రాజకీయాలపై...
ఇద్దరి మధ్య జాతీయ రాజకీయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, ఆయన ఆలోచనలను భగవంత్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికలపై కూడా వారు చర్చించుకున్నట్లు తెలిసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలసి కాంగ్రెస్, బీజేపీలను ఓడించడంపై వారు చర్చించారని చెబుతున్నారు.
- Tags
- bhagwat singh
- kcr
Next Story

