Sun Dec 21 2025 08:31:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పల్స్ పోలియో
నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేస్తారు

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. పోలియో చుక్కల పట్ల ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెరిగింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు విరివిగా చేస్తుండటంతో పోలియో మహ్మమ్మారి జాడ కన్పించడం లేదు.
రెండు రాష్ట్రాల్లో.....
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. అన్ని ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలుతో పాటు గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పోలీయో చుక్కలు వేసే కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటింటికి వెళ్లి సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Next Story

