Fri Mar 20 2026 13:54:43 GMT+0530 (India Standard Time)
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణదీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆమరణదీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆమెను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. లోటస్ పాండ్ లో దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు భగ్నం చేసి అపోలో ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా షర్మిల దీక్ష చేస్తుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు సూచించడంతో పోలీసులు బలవంతంగా వైఎస్ షర్మిలను ఆసుపత్రికి తరలించారు.
ఆరోగ్యం క్షీణించడంతో...
వైఎస్సార్టీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వైఎస్ షర్మిల దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ లోని తన ఇంట్లోనే షర్మిల దీక్షకు దిగారు. అయితే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోక పోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించి దీక్షను భగ్నం చేశారు.
Next Story

