Sat Dec 13 2025 22:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి

తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రయివేటు కళాశాలల యాజమాన్యం, ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం కావడంతో బంద్ ను విరమించుకుంటున్నట్లు ప్రయివేటు కళాశాలల యాజమాన్యం ప్రకటించింది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలను విడుదల చేయాలంటూ ఈ నెల 3వ తేదీ నుంచి ప్రయివేటు కళాశాలలను బంద్ చేశారు.
చర్చలు సఫలం కావడంతో...
అయితే ప్రయివేటు కళాశాలల యాజమాన్యంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. కళాశాలల యాజమాన్యాలు పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని అడగ్గా, ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించింది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయివేటు కళాశాలల యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. దీంతో నేటి నుంచి ప్రయివేటు కళాశాలలు తెలంగాణలో తిరిగి ప్రారంభం కానున్నాయి.
Next Story

