Wed Mar 25 2026 05:42:25 GMT+0530 (India Standard Time)
11న హైదరాబాద్ కు మోదీ
ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు

ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. ఈ నెల పదో తేదీ నుంచి సెకండ్ యునైటెడ్ నేషన్స్ జియోస్పిటల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ ఈ సదస్సు జరగనుంది.
సదస్సులో పాల్గొనేందుకు....
ఈ సదస్సులో పాల్గొనేందుకు అక్టోబరు 11వ తేదీన ప్రధాని మోదీ హాజరు కానున్నారు. హెచ్ఐసీసీ లో జరిగే ఐక్యారాజ్య సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఆయన కేవలం అధికారిక కార్యక్రమాల్లోనే పాల్గొంటారని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Next Story

