Thu Mar 19 2026 08:19:44 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీ పర్యటన వాయిదా
ప్రధాన నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న ప్రధాని తెలంగాణకు రావాల్సి ఉంది

ప్రధాన నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 19న ప్రధాని తెలంగాణకు రావాల్సి ఉంది. వివిధ అభివృద్ధిపనులను, శంకుస్థాపనలను చేయాల్సి ఉంది. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోదీ ప్రారంభించేందుకు అన్ని రకాలు ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన వాయిదా పడింది.
శంకుస్థాపనలు...
దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు, కాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ కూడా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడటంతో తిరిగి ఎప్పుడు అన్నది త్వరలోనే తెలియనుంది.
Next Story

