Sun Mar 26 2023 10:00:45 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారయింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారయింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఇటీవల ఆయన పర్యటన ఖరారు అయినప్పటికీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్న కారణంగా ఆయన పర్యటన రద్దయింది. నిజానికి ఈ నెల 19న ప్రధాని తెలంగాణ పర్యటకు రావాల్సి ఉంది. అది రద్దు కావడంతో మరోసారి ఆయన పర్యటనను పీఎంవో ఖరారు చేసింది.
వచ్చే నెల 13న...
అందిన సమాచారం మేరకు వచ్చే నెల 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
Next Story