Fri Mar 20 2026 04:21:48 GMT+0530 (India Standard Time)
Narendra Modi : తెలంగాణలో మూడు రోజులు మోదీ.. పర్యటించేది ఇక్కడే
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయింది. దక్షిణాది రాష్ట్రాలో ఐదు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారయింది. దక్షిణాది రాష్ట్రాలో ఐదు రోజుల పాటు మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారకని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకే రోజు మూడు సభల్లో పాల్గొనేలా పార్టీ ప్లాన్ చేసింది. తెలంగాణలో మూడు రోజుల పాటు నరేంద్ర మోదీ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు బహిరంగ సభల్లో...
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16, 18, 19 తేదీలలో తెలంగాణలో పర్యటిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మోదీ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగత్యాల, నాగర్ కర్నూలు, మల్కాజ్‌గిరిలలో ఆయన పర్యటిస్తారని, బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story

