Mon Mar 16 2026 00:31:49 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు నాగర్‌కర్నూలుకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు నాగర్ కర్నూలులో పర్యటించనున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు నాగర్ కర్నూలులో పర్యటించనున్నారు. అక్కడ జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న నరేంద్ర మోదీ మల్కాజ్ గిరిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. రాత్రికి రాజ్‌భవన్ లో నరేంద్ర మోదీ బస చేశారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్‌కర్నూలుకు చేరుకుంటారు.
మూడు పార్లమెంటు స్థానాలకు...
అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. పాలమూరు, నాగర్‌కర్నూలు, నల్లగొండ పార్లమెంటు స్థానాలకు చెందిన కార్యకర్తలను ఈ సభకు సమీకరించనున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్ లో గుల్బర్గాకు బయలుదేరి వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 18వ తేదీన జగిత్యాల లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

