Fri Jan 30 2026 09:38:22 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పాలమూరుకు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు నుంచే ఎన్నికల నగరాను ప్రధాని మోగించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. పాలమూరు నుంచే ఎన్నికల నగరాను ప్రధాని మోగించనున్నారు. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ లో నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.
అభివృద్ధి పనులను...
ప్రధాని మోదీ ఈ సందర్భంగా దాదాపు పదమూడు వేల 500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయడానికి పార్టీ నేతలు అన్ని నియోజకవర్గాల నుంచి యత్నిస్తున్నారు. ప్రధాని సభను సక్సెస్ చేసే దిశగా బీజేపీ ప్రయత్నిస్తుంది.
Next Story

