Mon Mar 16 2026 21:48:39 GMT+0530 (India Standard Time)
ప్రధాని రాక ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ పర్యటనకు రానున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆధునికీకరణ పనులతో పాటు పలు రోడ్లు, అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
బహిరంగ సభ...
అధికారిక కార్యక్రమాల తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో కూడా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఈడీ విచారించిన తర్వాత తొలి సారి తెలంగాణ పర్యటనకు వస్తున్న మోదీ చేసే విమర్శలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ తెలంగాణలో అధకారంలోకి వచ్చేందుకు ప్రధాని ఇక తరచూ పర్యటిస్తుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

