Fri Dec 05 2025 15:26:16 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు జగిత్యాలకు ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు జగిత్యాలలో పర్యటించ నున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి జగిత్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుంటారు. జగిత్యాలలో బీజేపీ విజయసంకల్ప సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేతలు చేశారు. ఈ సభలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పరిచయం చేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి...
నిన్న ఏపీలో ఎన్డీఏ కూటమిలో పాల్గొన్న ప్రధాని నేడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున జనసమీకరణ చేయడానికి నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటకే సభ ప్రాంగణానికి బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్డీఏకు ఈ ఎన్నికల్లో 400 స్థానాలు ఇవ్వాలంటూ ప్రధాని పదే పదే కోరుతున్న సంగతి తెలిసిందే.
Next Story

