Thu Mar 19 2026 21:33:53 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు తిరుమలకు ప్రధాని నరేంద్ర మోదీ
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి వెళ్లి రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు

ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం బయలుదేరి వెళ్లి రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి ఎయిర్ పోర్ట్‌లో స్వాగతం పలకనునన్నారు. ఈరోజు రాత్రికి తిరుమలలోని రచన అతిధి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
ప్రచారం ముగిసిన తర్వాత...
ఈరోజు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ లోని కన్హా శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు దుబ్బాక వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్‌రావు కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ కు బయలుదేరి వెళతారు. సాయంత్రం 4.25 వరకూ అక్కడే ఉండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని నేరుగా తిరుపతికి చేరుకుంటారు.
Next Story

