Sat Mar 07 2026 23:40:17 GMT+0530 (India Standard Time)
Narendra Modi : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ కు నేడు చేరుకుని రాత్రికి రాజ్ భవన్ లో బస చేయనున్నారు. ఈ రాత్రికి హైదరాబాద్ లోనే ఉండి రేపు వేములవాడ ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళతారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగనుంది.
వరంగల్ లోనూ...
వేములవాడ సభలో అక్కడి అభ్యర్థికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తర్వాత వరంగల్ కు బయలుదేరి వెళతారు. వరంగల్ లో జరిగే సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి బయలుదేరి ఏపీ పర్యటనకు వెళతారు.
Next Story

