Tue Mar 17 2026 18:57:21 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయను రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయను రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో హైదారాబాద్ కు వచ్చి తిరిగి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు. మోదీ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు. తొలుత మోదీ హైదరాబాద్ లోని ఇక్రిశాట్ సర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ లోగో, స్టాంప్ ను మోదీ విడుదల చేసి ప్రసంగించనున్నారు. ఇక్రిశాట్ లో మోదీ దాదాపు గంటన్నర సేపు ఉంటారు.
శ్రీరామనగరలో....
అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి ప్రధాని మోదీ చేరుకుటారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. దీంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. డ్రోన్ లపై నిషేధం విధించారు. రాత్రి 8.40 గంటల ప్రాంతంలో ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళతారు.
Next Story

