Wed Jan 21 2026 02:42:56 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : వెంకయ్యనాయుడుపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రశంసలు కురిపించారు

ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్యనాయుడు జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన పుస్తకాల ను మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరగగా, మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకయ్యనాయుడు రూరల్ ప్రాంతంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు.
ఎందరికో ప్రేరణ అంటూ...
ఈ పుస్తకాలు దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. ఎంతో మంది ఆయననుంచి ప్రేరణ పొందారన్న ప్రధాని నరేంద్ర మోదీ ఎమెర్జెన్సీ కాలం నుంచి వెంకయ్య నాయుడు పోరాడిన తీరు అభినందనీయమని తెలిపారు. పదిహేడు నెలల జైలు జీవితం అనుభవించిన నాయుడు గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. అందరూ వెంకయ్యేను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
Next Story

