Thu Dec 18 2025 18:03:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : 3న నిజామాబాద్ కు మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ వరస పర్యటనలు చేస్తున్నారు. అక్టోబరు 3న మోదీ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ వరస పర్యటనలు చేస్తున్నారు. అక్టోబరు 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. 3వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని నిజామాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం అక్కడి నుంచి బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు.
ఎన్నికల కోసం...
తెలంగాణ ఎన్నిలకు దగ్డర పడుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు చేస్తూ పార్టీ నేతల్లోనూ క్యాడర్ లోనూ ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కోసం కమిటీని నియమించింది. ఐదుగురు మంత్రులతో పాటు 26 మంది సభ్యులతో కమిటీని కూడా నియమించింది. ఈ నెల 30న మహబూబ్ నగర్, 3న నిజామాబాద్ లో పర్యటించనున్న ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Next Story

