Thu Dec 18 2025 23:03:09 GMT+0000 (Coordinated Universal Time)
కైసే హో.. సంజయ్
బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రత్యేకంగా పలకరించారు

బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రత్యేకంగా పలకరించారు. ఎలా ఉన్నావంటూ సంజయ్‌ను ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల బండి సంజయ్‌ను పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన సంజయ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
కొద్దిమందికే...
మొత్తం 32 మంది ప్రజాప్రతినిధులు, అధికారులను బేగంపేటకు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అనుమతించారు. వీరిలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు ఉన్నారు. ప్రధాని రాక సందర్భంగా కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

