Sat Mar 21 2026 11:09:25 GMT+0530 (India Standard Time)
సికింద్రాబాద్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకర ఘటన అని అన్నారు

సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దురదృష్టకర ఘటన అని అన్నారు. అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. సెల్లార్ లో ఉన్న ఎలక్ట్రిక్ బ్యాటరీలు ఉండటం, ఒక బ్యాటరీ ఛార్జి చేస్తుండగా పేలిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.
ఎక్స్ గ్రేషియో....
మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
Next Story

