Wed Mar 18 2026 23:04:02 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. పోరాటానికి జాతీయ పార్టీ నేతల మద్దతు ఉంటుందని ప్రధాని ప్రకటించారు. ఇటీవల బండి సంజయ్ జాగరణ దీక్ష, తర్వాత అరెస్ట్ వంటి వాటిపై ప్రధాని మోదీ బండి సంజయ్ ను అడిగి తెలుసుకున్నారు.
జీవో వివరాలను...
317 జీవో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ జీవో వల్ల జరిగే నష్టాన్ని బండి సంజయ్ ను అడిగారు. ప్రజాపోరాటం చేయాలని, పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని ప్రధాని మోదీ బండి సంజయ్ కు భరోసా ఇచ్చారు. ప్రజల వెంట ఉండే వారికి ఎప్పుడూ మద్దతు లభిస్తుందని ఆయన చెప్పారు.
- Tags
- modi
- bandi sanjay
Next Story

